Nara Lokesh: నారావారిపల్లెలో భోగి వేడుకలు.. సందడి చేసిన లోకేశ్, బ్రహ్మణి, దేవాన్ష్

  • రాష్ట్రవ్యాప్తంగా భోగి వేడుకలు
  • భోగి మంటల్లో చిన్నారుల కేరింతలు
  • తెల్లవారుజామునే పాల్గొన్న లోకేశ్ కుటుంబ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భోగి సంబరాలు మిన్నంటాయి. పిల్లలు, పెద్దలు భోగి మంటలు వేసి పండుగ జరుపుకున్నారు. భోగి మంటల్లో చలికాచుకుంటూ చిన్నారులు కేరింతలు కొట్టారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో జరిగిన వేడుకల్లో మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్ పాల్గొన్నారు. ప్రతి ఏడాది స్వగ్రామంలోనే సంక్రాంతి పండుగను జరుపుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఒక రోజు ముందుగానే గ్రామానికి చేరుకుంది. ఈ రోజు తెల్లవారుజామున నిర్వహించిన భోగి వేడుకల్లో లోకేశ్ కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు స్వగ్రామానికి చేరుకుని సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్నారు.
Nara Lokesh
Andhra Pradesh
Bhogi festival
Naravari palle
Chandrababu

More Telugu News