Andhra Pradesh: కర్నూలులో దిగిన ‘రామ్ జీ గ్యాంగ్’.. జాగ్రత్తగా ఉండాలని పోలీసుల హెచ్చరిక!

  • కార్లు, ఏటీఎం కేంద్రాలే లక్ష్యంగా చోరీ
  • తమిళనాడు నుంచి కార్యకలాపాల నిర్వహణ
  • తొలి చోరి శుక్రవారం జరిగిందని వెల్లడి

ఆగి ఉన్న వాహనాలు, ఏటీఎం సెంటర్లే వాళ్ల టార్గెట్. ఏటీఎం కేంద్రాల వద్ద ప్రజల దృష్టి మరల్చి నగదును, వాహనాల అద్దాలను ధ్వంసం చేసి విలువైన వస్తువులను దోచుకుంటారు. ఈ తరహా దోపిడీలకు పాల్పడుతున్న రామ్ జీ ముఠా కర్నూలులో అడుగుపెట్టిందని పోలీసులు తెలిపారు. రెండ్రోజుల క్రితం నగరంలోని మౌర్యా ఇన్ హోటల్ వద్ద ఆపిన కారులో నగదును ఈ ముఠానే అపహరించిందని వ్యాఖ్యానించారు. పార్కింగ్ చేసిన కార్ల అద్దాలను ధ్వంసం చేసి వీరు చోరీలకు పాల్పడుతారని పేర్కొన్నారు.

ఈ ముఠా తమిళనాడు నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తుందని వ్యాఖ్యానించారు. రామ్ జీ గ్యాంగ్ నగరంలోకి అడుగుపెట్టినట్లు తమ వద్ద ప్రాథమిక సమాచారం ఉందని తెలిపారు. కొత్త వ్యక్తుల మాటలు నమ్మవద్దనీ, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగదు, నగలు, విలువైన వస్తువులను బ్యాంకుల్లో దాచుకోవాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ యాప్(ఎల్ హెచ్ఎంఎస్) యాప్ ను వినియోగించుకోవాలని చెప్పారు.

More Telugu News