Andhra Pradesh: మీడియా ఎఫెక్ట్.. పంతంగి టోల్ గేట్ ఎత్తివేసిన నిర్వాహకులు.. వాహనదారుల హర్షం!

  • కొన్ని టోల్ గేట్ల వద్ద ఫ్రీగా వెళుతున్న వాహనాలు
  • టోల్ నిర్వాహకులతో మాట్లాడిన తెలంగాణ అధికారులు
  • ప్రత్యేక అనుమతులు అవసరంలేదని స్పష్టీకరణ

తెలంగాణ ప్రభుత్వం టోల్ ఫీజును రద్దు చేసినప్పటికీ టోల్ నిర్వాహకులు పలువురు టోల్ ఫీజును వసూలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మీడియాలో వరుస కథనాలు రావడంతో అధికారులు స్పందించారు. నల్గొండలోని పంతంగితో పాటు కొన్ని ప్రాంతాల్లోని  టోల్ నిర్వాహకులతో మాట్లాడారు. వాహనాలను ముందుకు వదలడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) అనుమతి అవసరం లేదని తేల్చిచెప్పారు. వాహనాలను పోనివ్వాలని ఆదేశించారు.

దీంతో పంతంగితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో టోల్ ఫీజును నిర్వాహకులు ఎత్తివేశారు. ప్రభుత్వ చర్యతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా చాలాచోట్ల టోల్ నిర్వాహకులు ప్రభుత్వ ఆదేశాలను కాదని ఫీజును వసూలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు, ఈ నెల 16న టోల్ ఫీజు వసూలును రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రటించిన సంగతి తెలిసిందే. ప్రజల సౌలభ్యం, ట్రాఫిక్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సీఎస్ ఎస్కే జోషి తెలిపారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా నిన్న, నేడు, ఈనెల 16న టోల్ ఫీజును రద్దుచేసింది.

  • Loading...

More Telugu News