Vijay Sai Reddy: నవరత్నాలను కాపీ కొట్టినా నిన్ను నమ్మే పరిస్థితి లేదు బాబూ : విజయసాయిరెడ్డి ట్వీట్‌

  • రోగిని కోమాలోకి నెట్టి ఇప్పుడు వెంటిలేటర్‌ పెడతారా
  • ఈ నాలుగున్నరేళ్లు ఏం చేశారు
  • రాష్ట్రంలో అవినీతి సామ్రాజ్యం
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యోక్తులు సంధించారు. 'మా పార్టీ అధినేత జగన్‌ ప్రకటించిన నవరత్నాలను కాపీకొట్టి పింఛన్‌లు పెంచుతూ ఎన్నికల ముందు మీరెన్ని ప్రకటనలు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు' అని ఎద్దేవా చేస్తూ ట్వీట్‌ చేశారు. ప్రజలు అధికారం అప్పగిస్తే నాలుగున్నరేళ్లపాటు రాష్ట్రాన్ని గాలికి వదిలేసి అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారని, ఇప్పుడు మీకు ప్రజలు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. రోగిని కోమాలోకి నెట్టేసి వెంటిలేటర్‌ పెట్టినట్లు మీ తీరుందని ఎద్దేవా చేశారు.
Vijay Sai Reddy
Chandrababu
tweet

More Telugu News