Andhra Pradesh: సంక్రాంతి సంబరాలు.. రేపు తెనాలికి ‘జనసేన’ అధ్యక్షుడు

  • నాదెండ్ల మనోహర్ వ్యవసాయ క్షేత్రంలో సంబరాలు
  • భోగి వేడుకల్లో పాల్గొననున్న పవన్ కల్యాణ్
  • పెదరావూరు వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లు పూర్తి
రేపు తెనాలిలో రేపు నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కు చెందిన పెదరావూరులోని వ్యవసాయ క్షేత్రంలో రేపు నిర్వహించే భోగి వేడుకల్లో పవన్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెనాలిలో పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు, నాయకులు సిద్ధమవుతున్నారు. పవన్ కు స్వాగతం పలికేందుకు ఫ్లెక్సీలు, బ్యానర్లు ఇప్పటికే ఏర్పాటు చేశారు. పెదరావూరు వ్యవసాయ క్షేత్రంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్టు సమాచారం.
Andhra Pradesh
tenali
janasena
Pawan Kalyan

More Telugu News