Andhra Pradesh: రెండు చేతులు లేని దివ్యాంగులకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇస్తాం: సీఎం చంద్రబాబు

  • ఇలాంటి వారు ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నారు
  • రాష్ట్ర వ్యాప్తంగా 200-300 మంది ఉంటారు
  • రెండు చేతులు లేని దివ్యాంగులను గుర్తించాలని ఆదేశించా
రెండు చేతులు లేని దివ్యాంగులకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయడు తెలిపారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు చేతులు లేని దివ్యాంగులు ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారు రెండు వందల నుంచి మూడు వందల మంది ఉంటారని చెప్పారు. రెండు చేతులు లేని దివ్యాంగులను గుర్తించాలని ఈ మేరకు అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. 
Andhra Pradesh
cm
Chandrababu
physically challenged
pension
amaravathi

More Telugu News