Andhra Pradesh: విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం.. వృద్ధుడి మృతి
- ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో ఏనుగుల సంచారం
- వెంపలవలస నుంచి ఏపీలోకి ఏనుగుల గుంపు
- నాయుడువలసలో ఏనుగుల దాడి.. వృద్ధుడు ఫకీర్ మృతి
ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో ఏనుగుల సంచారం కొనసాగుతోంది. రాయగడ జిల్లా వెంపలవలస నుంచి ఏపీలోకి ఏనుగుల గుంపు ప్రవేశించింది. ఐదు రోజులుగా పొడుగువలస, గాజులగూడలో ఏనుగుల గుంపు వైపు తారాజువ్వలను కురుపాం అటవీ అధికారులు వదిలారు. బాణసంచా దాడిలో ఏనుగులకు గాయాలైనట్టు అటవీ అధికారులు తెలిపారు.
బాణసంచా దాడితో తిరిగి ఒడిశావైపు ఏనుగుల గుంపు పయనమైంది. విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. నాయుడువలసలో ఏనుగుల దాడిలో ఫకీర్ (62) తీవ్రంగా గాయపడ్డాడు. పార్వతీపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అతను మృతి చెందాడు. నాయుడువలసలో 7 ఏనుగులు సంచరిస్తున్నాయి. కాగా, నాలుగు నెలలుగా ఏజెన్సీ గ్రామాల్లో ఏనుగుల సంచారంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.