అఖిలేష్, మాయావతిలది అపవిత్ర కలయిక: యోగి ఆదిత్యనాథ్
- సరైన సమయంలో ప్రజలు సరైన సమాధానం చెబుతారు
- వైరి పార్టీల మధ్య కూటమి ఏర్పడటం విచిత్రంగా ఉంది
- 2014 కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తాం
పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పార్టీల మధ్య కూటమి ఏర్పడటం విచిత్రంగా ఉందని యోగి అన్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి కూటమి ఏర్పడినా... 2014 ఎన్నికలకంటే మెరుగైన ఫలితాలను తాము సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఉదయం మాయావతి మాట్లాడుతూ, ఇక నుంచి మోదీ, అమిత్ షాలు నిద్రలేని రాత్రులను గడపబోతున్నారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.