alok varma: అలోక్ అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు లేకపోయినా.. మోదీ నేతృత్వంలోని కమిటీ హడావుడిగా నిర్ణయం తీసుకుంది: సుప్రీంకోర్టు మాజీ జడ్జి

  • సంచలన వ్యాఖ్యలు చేసిన జస్టిస్ ఏకే పట్నాయక్
  • సుప్రీం ఆదేశాల మేరకు విచారణను పర్యవేక్షించాను
  • నివేదికలోని నిర్ధారణలు నావి కాదు

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు లేవని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలోక్ పై వచ్చిన ఆరోపణలపై కేంద్ర నిఘా సంస్థ చేపట్టిన విచారణను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏకే పట్నాయక్ పర్యవేక్షించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, అలోక్ అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు లేకపోయినప్పటికీ...మోదీ నేతృత్వంలోని కమిటీ చాలా హడావుడిగా నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు.

అలోక్ వర్మపై సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానా ఇచ్చిన ఫిర్యాదు మేరకే దర్యాప్తు జరిగిందని పట్నాయక్ తెలిపారు. కేంద్ర నిఘా సంస్థ ఇచ్చిన నివేదికలోని నిర్ధారణలు తనవి కాదని... తనకు అందజేసిన నివేదికపై అస్థానా సంతకం ఉందని...అయితే, ఆ సంతకం తన సమక్షంలో పెట్టలేదని చెప్పారు. కేసుకు సంబంధించి సహజ న్యాయ సూత్రాలను, ఇతర విధానపరమైన నిబంధనలను మాత్రమే తాను పర్యవేక్షించానని తెలిపారు.

More Telugu News