భారత్ - ఆసీస్ వన్డే: భారత్ విజయ లక్ష్యం 289 పరుగులు

12-01-2019 Sat 12:12
  • భారత్ - ఆసీస్ జట్ల మధ్య సిడ్నీలో మొదటి వన్డే
  •  చెరో రెండు వికెట్ లు తీసిన కుల్దీప్, భువీ
  • రాణించిన పీటర్, ఉస్మాన్

భారత్ - ఆసీస్ జట్ల మధ్య సిడ్నీలో జరుగుతున్న మొదటి వన్డేలో ఆసీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో షాన్ మార్ష్ 54, ఉస్మాన్ ఖవాజా 59, పీటర్ హాండ్స్కంబ్ 73 పరుగులతో రాణించారు. మరో వైపు భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ తలో రెండు వికెట్లు తీయగా, జడేజాకి ఒక వికెట్ దక్కింది. చివరలో మార్కస్‌ స్టోయినిస్‌ 47, గ్లెన్ మాక్స్ వెల్ 11 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత్ ముందు 289 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచారు. కాగా, ఇండియా కాసేపటి క్రితం బ్యాటింగ్ ప్రారంభించింది.