Andhra Pradesh: సంక్రాంతి పండగ రద్దీ.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు!

  • తమ స్వస్థలాలకు బయలుదేరిన ప్రజలు
  • హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ
  • టోల్ ప్లాజా సిబ్బంది అదనపు కౌంటర్ల ఏర్పాటు
సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలు తమ స్వస్థలాలకు బయలుదేరి వెళుతున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండగ రద్దీ దృష్ట్యా ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ లు  ప్రత్యేక బస్సులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాయి. దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు ఎటువంటి అసౌకర్యం లేదు కానీ, సాధారణ ప్రయాణికులకు మాత్రం తిప్పలు తప్పట్లేదు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మొదలైంది. టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో టోల్ ప్లాజా సిబ్బంది అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసింది.
Andhra Pradesh
Telangana
bus
train
Vijayawada
Hyderabad
toll plaza

More Telugu News