Chandrababu: ప్రాణం ఉన్నంత వరకూ టీడీపీలోనే కొనసాగుతాం: భూమా బ్రహ్మానందరెడ్డి

  • టీడీపీతోనే మొదలైంది.. టీడీపీతోనే ముగుస్తుంది
  • అవన్నీ అవాస్తవాలే...
  • నా గెలుపును చంద్రబాబుకు కానుకగా ఇస్తా
భూమా ఫ్యామిలీ టీడీపీని వీడి జనసేన పార్టీలో చేరుతోందంటూ కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లోనూ.. పలు టీవీ ఛానళ్లలోనూ పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మంత్రి భూమా అఖిల ప్రియ స్పందించిన అనంతరం.. ఆమె సోదరుడు, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కూడా స్పందించారు. నేడు నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలంలో జరిగిన జన్మభూమిలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను అవాస్తవాలుగా కొట్టి పడేశారు. ప్రాణం ఉన్నంత వరకూ టీడీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. భూమా కుటుంబ రాజకీయ ప్రస్థానం టీడీపీతోనే మొదలైందని.. టీడీపీతోనే ముగుస్తుందని వెల్లడించారు. అంతకు ముందు అఖిల ప్రియ మాట్లాడుతూ పార్టీ మారాల్సిన కర్మ తమకు పట్టలేదని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని.. తన గెలుపును చంద్రబాబుకు కానుకగా ఇస్తానని తెలిపారు.
Chandrababu
Janmabhoomi
Brahmananda Reddy
Akhila Priya
Nandyala

More Telugu News