Andhra Pradesh: బీజేపీ పరిస్థితి బాగోలేదు.. ఏ పార్టీ నుంచి పోటీ చేసేది ‘కోడ్‘ వచ్చాక చెబుతా: విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

  • ఏపీలో బీజేపీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది
  • అందుకే, తమ నాయకులు కొందరు పార్టీ  వీడారు
  • విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా
ఏపీలో బీజేపీ పరిస్థితి బాగోలేదంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో బీజేపీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని, అందుకే, తమ నాయకులు కొందరు పార్టీని వీడారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయం గురించి కూడ ఆయన ప్రస్తావించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఏ పార్టీ నుంచి పోటీ చేసేది ఎన్నికల కోడ్ వచ్చాక చెబుతానని అన్నారు. కాగా, ఇటీవలే రాజమండ్రి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా పార్టీని వీడుతున్నట్టు వార్తలొచ్చాయి. బీజేపీని వీడే వారి జాబితాలో విష్ణుకుమార్ రాజు పేరు కూడా ఇప్పుడు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
Andhra Pradesh
BJP
Vishnukumar raju
MLA
aakula
satyanarayna

More Telugu News