vivek oberoi: బోయపాటితో వివేక్ ఒబెరాయ్ చేయననే చెప్పాడట

  • ఈ రోజే థియేటర్లకు వచ్చిన చరణ్ మూవీ
  • పవర్ఫుల్ గా తీర్చిదిద్దిన విలన్ పాత్ర
  • వివేక్ ఒబెరాయ్ ను ఒప్పించిన బోయపాటి        
బోయపాటి దర్శకత్వం వహించిన 'వినయ విధేయ రామ' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చరణ్ కథానాయకుడిగా చేసిన ఈ సినిమాలో విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటించారు. విలన్ పాత్రలతో బాలీవుడ్లో వివేక్ ఒబెరాయ్ బిజీగా వున్నారు. 'వినయ విధేయ రామ'లో విలన్ పాత్రను వివేక్ ఒబెరాయ్ చేస్తేనే బాగుంటుందని భావించిన బోయపాటి, ముందుగా ఆయనని సంప్రదించినప్పుడు తనకి కుదరదనే చెప్పారట.

ఆ తరువాత బోయపాటి ఈ సినిమాలో విలన్ పాత్ర ఎలా ఉంటుందనేది ఆయనకి పూర్తిగా చదివి వినిపించాడు. విలన్ పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందనేది ఆయనకి అర్థం కాగానే చేయడానికి అంగీకరించారట. ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తే మీరు చేయవలసిందేనని బోయపాటి పట్టుబట్టడం కూడా వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణమైందని అంటున్నారు. చరణ్ తో తలపడుతూ విలన్ గా ఆయన ఎన్ని మార్కులు కొట్టేస్తాడో చూడాలి మరి.
vivek oberoi

More Telugu News