జగన్ దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును జ్యుడీషియల్ రిమాండ్ కు పంపిన కోర్టు!
- లోతుగా విచారణ జరపాలన్న ఎన్ఐఏ అధికారులు
- తమ కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి
- నిన్న విశాఖ జైలు నుంచి అదుపులోకి
ఈ సందర్భంగా ఎన్ఐఏ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జగన్ పై హత్యాయత్నం కేసులో విచారణ జరిపేందుకు నిందితుడిని కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ విషయంలో లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని వివరించారు.
వాదనలు విన్న న్యాయమూర్తి.. శ్రీనివాసరావును ఈ నెల 25 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ కు పంపుతూ ఉత్తర్వులు జారీచేశారు. గతేడాది అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు కోడికత్తితో జగన్ పై దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో లోతైన గాయం కావడంతో జగన్ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.