YSRCP: ఇలాంటి నాయకుడి దగ్గర పనిచేయడం ఎంతో గర్వంగా భావిస్తున్నా: వైసీపీ ఎమ్మెల్యే రోజా

  • వీఐపీలా కాకుండా సాధారణ దర్శనానికి జగన్
  • ఏ దర్శనంలో వెళ్లినా దేవుడు ఆశీర్వదిస్తారన్న నమ్మకం
  • అందరి దేవుళ్లను నమ్మి, గౌరవించే వ్యక్తి జగన్
ప్రజా కుటుంబంలో తాను కూడా ఒకడినన్న భరోసా జగన్ ఇస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తిరుమలలో జగన్ కు స్వాగతం పలికేందుకు అక్కడికి చేరుకున్న ఆమెను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీఐపీ దర్శనం కాకుండా సామాన్యుడిలా సాధారణ దర్శనానికి జగన్ వెళుతున్నారని, ఏ దర్శనంలో వెళ్లినా దేవుడు ఆశీర్వదిస్తాడన్న నమ్మకం ఆయనకు ఉందని చెప్పారు. అందరి దేవుళ్లను నమ్మి, గౌరవించే జగన్, ఈరోజు సాధారణ భక్తులతో కలిసి దర్శనానికి వెళ్లడం తమకు ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ఇలాంటి నాయకుడి దగ్గర పనిచేయడం ఎంతో గర్వంగా భావిస్తున్నామని రోజా చెప్పారు.
YSRCP
Ys jagan
roja
Tirumala
Tirupati

More Telugu News