Huawei Y9: హువావే వై9 (2019) స్మార్ట్ ఫోన్ పై రూ.2990 విలువ గల బ్లూటూత్ హెడ్ సెట్ ఉచితం

  • భారత్ లో విడుదలైన హువావే వై9 (2019)
  • మూడు రంగులలో లభ్యం 
  • ధర రూ.15,990

హువావే సంస్థ తన నూతన స్మార్ట్ ఫోన్ 'వై9 2019' ని ఈరోజు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేసింది. మిడ్ నైట్ బ్లాక్, సఫైర్ బ్లూ, అరోరా పర్పుల్ అనే మూడు రంగులలో లభించే ఈ ఫోన్ ను అమెజాన్ వెబ్ సైట్లో ఈ నెల 15 నుండి ప్రత్యేకంగా విక్రయించనున్నారు. పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ రూ.15,990 ధరకి వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. అలాగే, ఈ ఫోన్ తో రూ.2990 విలువ గల బ్లూ టూత్ వైర్ లెస్ హెడ్ సెట్ ని ప్రతి కొనుగోలుపై ఉచితంగా ఇవ్వనున్నారు.

ప్రత్యేకతలు: 

  • 6.5" ఫుల్ హెచ్డీ ప్ల‌స్ డిస్‌ప్లే (2340 × 1080 పిక్స‌ల్స్)
  • ఆక్టాకోర్ కీరిన్ 710 ప్రాసెస‌ర్‌
  • 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 16/2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 13/2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు
  • ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
  • 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

More Telugu News