Jagan: రైలులో రేణిగుంటకు చేరుకున్న జగన్.. కారులో తిరుపతికి ప్రయాణం!
- నిన్న పాదయాత్రను ముగించిన జగన్
- ఉదయం 10 గంటలకు రేణిగుంటకు
- ఒంటిగంట నుంచి తిరుమలకు నడక ప్రయాణం
తన పాదయాత్రను ఇచ్చాపురంలో ముగించుకుని, తిరుమలకు దురంతో రైలులో బయలుదేరిన వైఎస్ జగన్, ఈ ఉదయం పది గంటలకు రేణిగుంటకు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున అభిమానులు, వైకాపా కార్యకర్తలు తరలివచ్చారు. రైలు దిగి బయటకు వచ్చిన ఆయన, అభివాదం చేస్తూ, తన వాహనంలో తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ కు బయలుదేరి వెళ్లారు.
అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అలిపిరి చేరుకుని, అక్కడి నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు. రాత్రి 7 గంటల సమయంలో ఆయన సామాన్య భక్తులు వెళ్లే మార్గంలో ఆలయంలోకి ప్రవేశించి స్వామిని దర్శించుకుంటారని, రాత్రికి తిరుమలలో బస చేస్తారని వైకాపా నేతలు వెల్లడించారు.