Sankranti: కోడి పందాలు షురూ... రంగంలోకి దిగిన పోలీసులు!

  • సంక్రాంతి సందడి మొదలు
  • పామాయిల్ తోటల్లో పందాలు
  • దాడులు చేసిన పోలీసులు
ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పలువురు స్వస్థలాలకు వస్తుండటంతో పల్లెల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇదే సమయంలో కోడి పందాలు కూడా మొదలు కాగా, పోలీసులు అడ్డుకున్నారు. పెద్దాపురం సమీపంలోని రంగంపేట వద్ద పామాయిల్ తోటల్లో పందాలు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతంపై దాడులు చేశారు. మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశామని, పందెం కోళ్లను, నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కోడి పందాలకు అనుమతి లేదని, పందాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు.
Sankranti
Kodi Pandalu
East Godavari District
West Godavari District

More Telugu News