Rajya Sabha: ఇంత హడావుడిగా ఈ బిల్లు ఎందుకు తెస్తున్నారో వారికే తెలియాలి?: కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబాల్

  • ఈ బిల్లుకు మూడు ప్రధాన అడ్డంకులు ఉన్నాయి
  • దీనిని ఎలా అమలు చేస్తారన్నది అసలు సమస్య
  • ఈబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏమైనా గణాంకాలు   సిద్ధం చేశారా?

ఇంత హడావుడిగా ఈబీసీ రిజర్వేషన్ బిల్లును ఎందుకు తెస్తున్నారో బీజేపీ నేతలకే తెలియాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కపిల్ సిబాల్ విమర్శించారు. ఈబీసీ రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో ఈరోజు జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లుకు మూడు ప్రధాన అడ్డంకులు ఉన్నాయని, ఈ బిల్లును ఎలా అమలు చేస్తారన్నది అసలు సమస్య అని అన్నారు.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు వస్తాయని చెబుతున్నారని, ఇందుకు సంబంధి ఏమైనా గణాంకాలు మీరు సిద్ధం చేశారా? రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించారా? అంటూ ప్రశ్నిస్తూ, 1980లోని మండల్ కమిషన్ నివేదిక 1990లో ఆమోదం పొందిన విషయాన్ని కపిల్ సిబాల్ గుర్తుచేశారు.

రూ.2.5 లక్షల ఆదాయం దాటిన వారు ఆదాయ పన్ను కట్టాలంటున్నారు, ఇప్పుడేమో, రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని అంటున్నారని విమర్శించారు. ఆదాయ పన్ను పరిమితిని కూడా సడలిస్తూ నిబంధనలు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News