Rajath kumar: ఎన్నికలకు ముందు పేరు సరిచూసుకోవడం పౌరుల బాధ్యతే: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్

  • 25 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తాం
  • ఫిబ్రవరి 25న తుది జాబితా
  • 6 లక్షల ఓట్ల తొలగింపు

ఓటర్ నమోదు కోసం ఈ నెల 25 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని.. ఫిబ్రవరి 25న తుది జాబితా ప్రకటిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటరు జాబితా విషయమై ఎక్కువ ఆరోపణలు వచ్చాయన్నారు.

ఇప్పటి వరకూ 9,54,827 అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చాయని.. అలాగే ఓటు తొలగింపు కోసం పదివేల దరఖాస్తులు వచ్చాయని రజత్ కుమార్ వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో 6 లక్షల ఓట్ల తొలగింపు జరిగిందని.. ఎన్నికలకు ముందు ఓటరు జాబితాలో పేరు సరిచూసుకోవడం పౌరుల బాధ్యతేనన్నారు. తుది ఓటరు జాబితా ముద్రణ తర్వాత ఓట్ల తొలగింపు, డబుల్ ఓట్లను తొలగించడం కుదరదని రజత్ కుమార్ స్పష్టం చేశారు.
   

More Telugu News