Venkatesh: చేతికి గాయం కారణంగా ‘రోజా’ చిత్రాన్ని వదులుకున్నా: వెంకటేష్

  • ఏం జరిగినా మన మంచికే
  • దాని గురించి నేనెప్పుడూ బాధపడలేదు
  • ‘సుందరకాండ’ వంటి చిత్రాలెన్నో చేశాను

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్2’. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా వెంకటేష్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'రోజా' సినిమాలో వాస్తవానికి తాను నటించాల్సిందని వెంకీ చెప్పారు. ‘‘రోజా’ సినిమాను నేను చేయాల్సింది. కానీ ఆ సమయంలో చేతికి గాయం కావడంతో చేయలేకపోయా. దాని గురించి నేనెప్పుడూ బాధ పడలేదు. ఆ సినిమా చేయలేకపోయినా ‘సుందరకాండ’ వంటి కుటుంబ కథా చిత్రాలు ఎన్నో చేశాను. ఏం జరిగినా మన మంచికే అనుకుంటాను’’ అని వెంకీ తెలిపారు.

More Telugu News