Saleem: జగన్‌పై దాడి కేసు... నిందితుడి బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న లాయర్

  • కేసును ఎన్ఐఏకు అప్పగించిన కేంద్రం
  • ఇటీవల శ్రీనివాసరావు కోసం బెయిల్ పిటిషన్
  • ఎన్ఐఏ కోర్టులోనే దాఖలు చేయాలి
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావు తరుపున లాయర్ అబ్దుల్ సలీం బెయిల్ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన దానిని వెనక్కి తీసుకున్నారు. ఇటీవల జగన్‌పై దాడి కేసుకు సంబంధించిన దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐఏకు అప్పగించింది. అయితే శ్రీనివాసరావుకు సంబంధించిన బెయల్ పిటిషన్‌ను ఎన్ఐఏకు సంబంధించిన కోర్టులోనే దాఖలు చేయాలని న్యాయమూర్తి సూచించారు. దీంతో లాయర్ సలీం బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.
Saleem
NIA
Jagan
Srinivasa Rao
Bail

More Telugu News