dhruv: 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ గా 'వర్మ' .. దుమ్మురేపేస్తోన్న ట్రైలర్

  • తెలుగులో హిట్ కొట్టిన 'అర్జున్ రెడ్డి'
  • తమిళ రీమేక్ గా 'వర్మ'
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు

తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా .. సందీప్ వంగా తెరకెక్కించిన 'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేస్తుండగా, తమిళంలో 'వర్మ' పేరుతో రీమేక్ చేస్తున్నారు. తమిళ రీమేక్ లో విక్రమ్ తనయుడు 'ధృవ్' హీరోగా చేస్తున్నాడు. బాలా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి, సూర్య చేతుల మీదుగా తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయించారు.

హీరో లైఫ్ లోని వివిధ కోణాలకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. రొమాన్స్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. దాదాపు తెలుగులో విజయ్ దేవరకొండ లుక్ లోనే ధృవ్ కూడా కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తమిళంలోను ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనీ, ధృవ్ కెరియర్ కి ఈ సినిమా ఎంతో హెల్ప్ అవుతుందని విక్రమ్ భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.                                                                      

More Telugu News