sensex: క్యూ3 ఫలితాలపై సానుకూల అంచనాలు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • తగ్గుతున్న అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు
  • 232 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 53 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. అమెరికా-చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాలు తగ్గుముఖం పడుతుండటంతో పాటు... కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలపై సానుకూల అంచనాలు ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 232 పాయింట్లు పెరిగి 36,213కు పెరిగింది. నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 10,855కు చేరుకుంది.

నిఫ్టీలోని 50 స్టాకుల్లో 24 స్టాకులు లాభాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, యూపీఎల్ తదితర సంస్థలు లాభాలను చవిచూశాయి. అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, భారత్ పెట్రోలియం, భారతి ఇన్ఫ్రాటెల్, సిప్లా తదితర సంస్థలు నష్టాలను మూటగట్టుకున్నాయి.

More Telugu News