NTR: ‘కథానాయకుడు’ని ఆశీర్వదించిన ప్రేక్షకదేవుళ్లందరికీ కృతఙ్ఞతలు: నందమూరి బాలకృష్ణ

  • ‘యన్.టి.ఆర్’ తొలి భాగం ‘కథానాయకుడు’ విడుదల
  • చిత్రాన్ని వీక్షించిన బాలకృష్ణ, కుటుంబసభ్యులు
  • ‘యన్.టి.ఆర్’ అందరికీ చెందిన సినిమా అన్న బాలకృష్ణ

‘యన్.టి.ఆర్’ చిత్రం తొలి భాగం ‘కథానాయకుడు’ని ఆశీర్వదించిన ప్రేక్షకదేవుళ్లందరికీ హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈరోజు విడుదలైన ‘యన్.టి.ఆర్’ చిత్రాన్ని హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో బాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యులు వీక్షించారు. అనంతరం, మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ చిత్రం అభిమానులకు సంబంధించింది కాదని, పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అందరికీ చెందిన సినిమా అని చెప్పారు.

  • Loading...

More Telugu News