maruthi: బన్నీ కోసం మారుతి గట్టిగానే ప్రయత్నించాడట!

  • 'శైలజా రెడ్డి అల్లుడు'తో పరాజయం 
  • బన్నీ .. విజయ్ దేవరకొండలపై దృష్టి
  • శర్వానంద్ తో సంప్రదింపులు      

మారుతి ఎన్నో ఆశలు పెట్టుకున్న 'శైలజా రెడ్డి అల్లుడు' ఆయనను పూర్తిగా నిరాశ పరిచింది. ఆ షాక్ నుంచి ఆయన తేరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ తరువాత ఆయన తన సినిమాను బన్నీతో చేయాలనుకున్నాడు. గీతా ఆర్ట్స్ తో మారుతికి మంచి స్నేహ సంబంధాలు వున్నాయి. అందువలన బన్నీతో చేయడానికి ఆయన గట్టి ప్రయత్నాలే చేశాడు. అయితే ఈ సారి త్రివిక్రమ్ తోనే చేయాలనే బలమైన నిర్ణయంతో బన్నీ ఉండటం వలన, మారుతి ప్రయత్నం ఫలించలేదు.

విజయ్ దేవరకొండతో చేయాలనే ఉద్దేశంతో ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేశాడట. అయితే ఆల్రెడీ విజయ్ దేవరకొండకి వరుస కమిట్ మెంట్స్ ఉండటంతో మారుతికి అక్కడ కూడా అవకాశం లేకుండా పోయింది. దాంతో శర్వానంద్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'మహానుభావుడు' వచ్చిన సంగతి తెలిసిందే. అందువలన శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఎక్కువ అని అంటున్నారు. 

More Telugu News