union budget: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ విడుదల

  • ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ సమావేశాలు
  • కేబినెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం
  • ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటు కార్యకలాపాలపై నిర్వహించిన సమావేశంలో కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా ఆరోసారి జైట్లీ పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుండటం గమనార్హం. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కానుంది. గత అక్టోబర్ నుంచే బడ్జెట్ ను రూపొందించే పనిలో కేంద్ర ఆర్థిక శాఖ నిమగ్నమై ఉంది.
union budget
2019-20
sessions
parliament

More Telugu News