lawrence: 'కాంచన 3' ఫస్టులుక్ తో అదరగొట్టేస్తోన్న లారెన్స్

  • లారెన్స్ దర్శక నిర్మాతగా 'కాంచన 3'
  • తాజాగా పూర్తిచేసుకున్న షూటింగ్ 
  • ఏప్రిల్ 18వ తేదీన విడుదల  

లారెన్స్ నుంచి వచ్చిన 'కాంచన' .. 'గంగ' సినిమాలు ప్రేక్షకులను ఒక రేంజ్ లో భయపెట్టేశాయి. బలమైన కథాకథనాలతో ప్రేక్షకులను భయపెడుతూనే, భారీ లాభాలను లారెన్స్ సొంతం చేసుకున్నాడు. దర్శక నిర్మాతగా కొంత గ్యాప్ తీసుకున్న ఆయన 'కాంచన 3'ని రూపొందించాడు. వేదిక .. నిక్కీ తంబోలి .. ఓవియా ఈ సినిమాలో కథానాయికలుగా కనిపించనున్నారు.

లారెన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా తాజాగా షూటింగును పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. రుద్రాక్షలు ధరించిన మధ్య వయస్కుడిగా .. స్టైల్ గా .. లారెన్స్ కాలుపై కాలు వేసుకుని కూర్చున్న ఈ పోస్టర్, ఆయన అభిమానులను ఆకట్టుకునేదిగా వుంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఏప్రిల్ 18వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ హారర్ థ్రిల్లర్ తో లారెన్స్ ఇంకెంతగా భయపెడతాడో చూడాలి మరి. 

More Telugu News