Rahul Gandhi: సోనియా, రాహుల్ లకు నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ

  • 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఆదాయాన్ని తక్కువ చేసి చూపించారు. 
  • ఇద్దరూ కలసి జరిమానా సహా రూ. 100 కోట్లు చెల్లించాలి
  • ఉద్దేశపూర్వకంగానే పన్ను ఎగవేశారు

యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఉద్దేశ పూర్వకంగా పన్ను ఎగవేశారని నోటీసులో పేర్కొంది. 2011-12 ఆర్థిక సంవత్సరానికి గాను వీరిద్దరూ రూ. 300 కోట్ల ఆదాయాన్ని తక్కువ చేసి చూపించారని తెలిపింది. ఆ సంవత్సరం రాహుల్ ఆదాయం రూ. 155 కోట్లు అయినప్పటికీ... రూ. 68 లక్షల ఆదాయాన్ని మాత్రమే చూపించి, ఆ మొత్తానికే పన్ను చెల్లించారని పేర్కొంది. రూ. 155.41 కోట్లకు సంబంధించి సోనియాగాంధీ... రూ. 155 కోట్లకు సంబంధించి రాహుల్ గాంధీలు జరిమానాతో కలిపి రూ. 100 కోట్లు చెల్లించాలని సూచించింది.  

More Telugu News