Alex Hipbern: వాట్స్ యాప్ గేమ్ కోసం... నిద్రపోతున్న అమ్మాయిపై ఆస్ట్రేలియన్ క్రికెటర్ అత్యాచారం!

  • వార్చస్టెర్ షైర్ కౌంటీకి ఆడుతున్న హిప్ బర్న్
  • జో క్లార్క్ గదికి వచ్చిన అమ్మాయి
  • యువతి అంగీకారంతోనే కలిశానంటున్న హిప్ బర్న్

ఆస్ట్రేలియా యువ క్రికెటర్ అలెక్స్ హెప్ బర్న్, తన స్నేహితుడు జో క్లార్క్ తో కలిసి ఓ యువతిని రేప్ చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు కావడం కలకలం రేపింది. నిద్రిస్తున్న ఓ అమ్మాయిపై వీరు అత్యాచారానికి తెగబడ్డారన్నది ప్రధాన ఆరోపణ. ఇంగ్లాండ్ లోని వార్చస్టెర్ షైర్ కౌంటీ క్లబ్ కు ఆడుతున్న హెప్ బర్న్ ఓ వాట్స్ యాప్ గేమ్ లో గెలవాలన్న కసితో ఈ పని చేశాడని బాధితురాలి తరఫున వాదించనున్న న్యాయవాది మిరండా మూరే తెలిపారు. తాను జో క్లార్క్ గదికి వెళ్లిన వేళ ఈ ఘటన జరిగిందని, ఇద్దరూ తనపై అత్యాచారం చేశారని బాధితురాలు వాపోయింది.

కాగా, ఈ వాట్స్ యాప్ ఆట నిబంధనల ప్రకారం, గ్రూప్ లోని వ్యక్తులు ఎంతమంది అమ్మాయిలను కలిశారో, ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుండాలి. నియమిత సమయం తరువాత, ఎవరు ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొంటే వారు విజేతగా నిలిచినట్టు. ఈ గేమ్ లో గెలవాలన్న ఆలోచనతో హిప్ బర్న్ ఈ పని చేశాడని మూరే తెలిపారు. కాగా, హెప్‌బర్న్ వాదన మాత్రం మరోలా ఉంది. తాను ఆ అమ్మాయి అంగీకారంతోనే సెక్స్‌ లో పాల్గొన్నానని అన్నాడు. ఆ సమయంలో యువతి నిద్రపోలేదని చెప్పాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

More Telugu News