Kondagatuu: కొండగట్టు బస్సు ప్రమాద బాధితురాలి మృతి.. నాలుగు నెలల పోరాటం తర్వాత మృత్యుఒడికి!

  • గతేడాది సెప్టెంబరులో ప్రమాదం
  • సోమవారం అర్ధరాత్రి మృతి చెందిన హరిత
  • 65కు పెరిగిన కొండగట్టు మృతుల సంఖ్య

గతేడాది సెప్టెంబరు 11న జరిగిన కొండగట్టు బస్సు ప్రమాదంలో మరో మహిళ ప్రాణాలు విడిచింది. నాలుగు నెలలపాటు మృత్యువుతో పోరాడి ఓడింది. ఆ ప్రమాదంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్యపల్లెకు చెందిన సురకంటి హరిత (35) తీవ్రంగా గాయపడింది. తలకు తీవ్రంగా గాయాలు కావడంతో ఆమెను తొలుత హైదరాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. నెల రోజుల క్రితం నుంచి ఇంట్లో చికిత్స అందిస్తున్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హరిత పరిస్థితి మరింత విషమించడంతో సోమవారం అర్ధరాత్రి ప్రాణాలు విడిచింది. ఆమె మృతితో కొండగట్టు ప్రమాద మృతుల సంఖ్య 65కు చేరింది. హరితకు భర్త సంజీవరెడ్డి, పదో తరగతి చదువుతున్న కుమారుడు ఆదిత్య రెడ్డి ఉన్నారు.

  • Loading...

More Telugu News