Anasuya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో అనసూయ
  • హిందీ సినిమా చేయనంటున్న చరణ్ 
  • బన్నీ సినిమాలో 'గీతగోవిందం' నాయిక 
  • తెలుగు స్ట్రెయిట్ సినిమాలో వరలక్ష్మి 
*  ఇటీవల వచ్చిన 'రంగస్థలం' చిత్రంలో రంగమ్మత్త పాత్ర పోషించిన యాంకర్ అనసూయ త్వరలో మళ్లీ సుకుమార్ చిత్రంలో నటించనుంది. మహేశ్ బాబుతో సుకుమార్ చేసే సినిమాలో అనసూయకు ఓ ముఖ్య పాత్రను ఆఫర్ చేసినట్టు సమాచారం.
*  మళ్లీ బాలీవుడ్ సినిమా చేసే ఆలోచన ఏమీ లేదని అంటున్నాడు హీరో రామ్ చరణ్. గతంలో ప్రియాంకా చోప్రాతో కలసి చరణ్ 'జంజీర్' సినిమా చేయగా, అది ఫ్లాపయిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా హిందీ సినిమాలు చేయడం గురించి అడిగితే, 'బాలీవుడ్ చిత్రాలకు దీటుగా మన చిత్రాలు వసూళ్లు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మళ్లీ హిందీ సినిమా చేయాల్సిన అవసరం లేదనిపిస్తోంది' అని చెప్పాడు.
*  అల్లు అర్జున్ సరసన 'గీత గోవిందం' హీరోయిన్ రష్మిక నటించే ఛాన్స్ కనిపిస్తోంది. బన్నీ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే చిత్రం కోసం రష్మికను సంప్రదిస్తున్నట్టు సమాచారం. మరోపక్క, కైరా అద్వాని ఇందులో హీరోయిన్ గా ఎంపికైందని ఇప్పటికే వార్తలొస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే, రెండో హీరోయిన్ గా రష్మికను తీసుకుంటున్నారనుకోవచ్చు.
*  ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు, ప్రముఖ నటి వరలక్ష్మి త్వరలో తొలిసారిగా ఓ స్ట్రెయిట్ సినిమా చేయనుంది. సందీప్ కిషన్ హీరోగా నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఓ కీలక పాత్రను చేయడానికి ఆమె ఓకే చెప్పింది.
Anasuya
Mahesh Babu
charan
Allu Arjun
Rashmika

More Telugu News