aiadmk: కులాల రిజర్వేషన్లను 69 శాతానికి పెంచాలి: అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై డిమాండ్

  • ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేపట్టాలి
  • సామాజిక వర్గాలు శాశ్వతమైనవి
  • రిజర్వేషన్లను ఆ విధంగా ఉంచాలని కోరుతున్నాం

అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ విషయమై అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై విమర్శలు చేశారు. లోక్ సభలో అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిజర్వేషన్లు ఉండాల్సింది కులాలపరంగా అని, నేడు ఆర్థికంగా వెనుకబడిన వారు ఈ బిల్లు సాయంతో విద్య, ఉద్యోగం పొందుతారని, ఆ తర్వాత వారు ఆర్థికంగా బలపడితే వారి ఉద్యోగాన్ని వెనక్కి తీసుకుంటారా? అని ప్రశ్నించారు.

ఈ ఆర్థిక అసమానతలు నిరంతరం మారుతూనే ఉంటాయి కనుక, రిజర్వేషన్లకు దానిని ప్రామాణికంగా తీసుకోలేమని అన్నారు. సామాజిక వర్గాలు శాశ్వతమైనవని, అందుకే, తాము రిజర్వేషన్లను ఆవిధంగా ఉంచాలని కోరుతున్నామని, కులాల పరంగా ఉన్న రిజర్వేషన్లను 50 శాతం నుంచి 69 శాతానికి పెంచాలని, ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేర్చిన తర్వాతే ఆచరణ సాధ్యం కాని ఈ బిల్లు గురించి ఆలోచిస్తామని తంబిదురై చెప్పడం గమనార్హం.

More Telugu News