Lok Sabha: ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు.. సవరణల ప్రతిపాదన

  • సమాజ నిర్మాణానికి జరిగే ప్రయత్నాన్ని స్వాగతిస్తాం
  • ఆర్థిక వెనుకబాటుకు కారణం ప్రభుత్వాలే
  • ఇప్పటివరకు ఉన్న ఏ ప్రభుత్వమూ సామాన్యుడి గురించి ఆలోచించలేదు

ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు పలికింది. ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి లోక్ సభలో చర్చ జరుగుతోంది. ఈ బిల్లుకి సవరణలను ప్రతిపాదిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, సమ్మిళిత వృద్ధి, బలమైన సమాజ నిర్మాణం కోసం జరిగే ప్రతి పయత్నాన్నీ టీఆర్ఎస్ స్వాగతిస్తుందని స్పష్టం చేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సరైన మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడమే ఆర్థిక వెనుకబాటుకు కారణమని, ఇప్పటివరకు ఉన్న ఏ ప్రభుత్వం కూడా సామాన్యుడి గురించి ఆలోచించలేదని విమర్శించారు.

ఉమ్మడి ఏపీలో 8 శాతం ఉన్న ముస్లిం జనాభా ఇప్పుడు తెలంగాణలో 12 శాతానికి చేరిందని, సామాజిక, ఆర్థిక వెనుకబాటు తనం ఆధారంగా రిజర్వేషన్ల కల్పనకు టీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించిందని  పేర్కొన్నారు. ఆ విషయం ఇంతకాలం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని, రిజర్వేషన్లు రాష్ట్రాల పరిధిలోనే ఉండాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.  

ఇంతకాలం ప్రభుత్వాల వైఫల్యం వల్లే ఆర్థిక వెనుకబాటు అనే సమస్య వచ్చిందని, విభజన తర్వాత తెలంగాణ జనాభా పరంగా అనేక మార్పులు వచ్చాయని అన్నారు. తమిళనాడు తరహాలోనే రిజర్వేషన్లు పెంచుకునేందుకు తమకు అవకాశం కల్పించాలని కోరారు.  

More Telugu News