Loksabha: లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం

  • పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన రాజ్ నాథ్
  • ఈ బిల్లుపై టీఎంసీ తీవ్ర ఆందోళన
  • సభ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్ 

లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. పార్లమెంట్ సమావేశాల్లో చివరి రోజైన ఈరోజు పలు కీలక బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టారు. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ బిల్లు, పౌరసత్వ సవరణ బిల్లును లోక్ సభ ముందు ఉంచారు. ఈ సవరణ బిల్లును బీజేపీ ఎంపీ రాజ్ నాథ్ సింగ్ సభలో ప్రవేశపెట్టారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ బిల్లు ఇది.

కాగా, పౌరసత్వ సవరణ బిల్లుపై టీఎంసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సభ నుంచి కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ బిల్లుకు ఆమోదం లభించడంతో అస్సాంతో బీజేపీ ప్రభుత్వానికి మిత్ర పక్షం అస్సాం గణపరిషత్ (ఏజీపీ) తమ మద్దతు ఉపసంహరించుకుంది.

అంతకుముందు, లోక్ సభలో రాజ్ నాథ్ మాట్లాడుతూ, పౌరసత్వ సవరణ బిల్లు దేశ పౌరుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని అన్నారు. ఈ బిల్లు కేవలం అసోంకే పరిమితం కాదని, ఇతర రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందని అన్నారు.  

More Telugu News