Loksabha: సామాజిక సమానత్వం కోసం ఈ చారిత్రక నిర్ణయం: కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్

  • అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్ల బిల్లుపై చర్చ
  • 15వ అధికరణకు క్లాజ్ (6) జోడించేందుకే ఈ బిల్లు  
  • అగ్రవర్ణ పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు

అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్ల బిల్లుపై లోక్ సభలో చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ, అగ్రవర్ణ పేదలకు ఆర్థిక స్తోమత లేక రిజర్వేషన్ల పరిధిలోకి రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని, సామాజిక సమానత్వం కోసమే ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, రిజర్వేషన్లు కాకుండా వేర్వేరు మార్గాల్లో వారికి ఊరట కలిగించే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. రాజ్యాంగంలోని 15వ అధికరణకు క్లాజ్ (6) జోడించేందుకు ఈ బిల్లు తీసుకొచ్చామని, ఈ బిల్లు ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అందుతాయని చెప్పారు. 

More Telugu News