LG Q9: యువతను ఆకట్టుకునేలా ఎల్.జీ నుండి నూతన స్మార్ట్ ఫోన్

  • దక్షిణ కొరియాలో విడుదలైన ఎల్.జీ క్యూ9
  • ధర సుమారుగా రూ.31,100
  • త్వరలో భారత మార్కెట్ లోకి

యువ వినియోగదారుల కోసం ఎల్.జీ సంస్థ తాజాగా కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ ని దక్షిణకొరియాలో ఆవిష్కరించింది. ఎల్.జీ క్యూ9 పేరిట విడుదలైన ఈ ఫోన్లో యువతను ఆకట్టుకునేలా ఫీచర్లని ఏర్పాటు చేశారు. భారీ డిస్ప్లే, అధునాతన ప్రాసెసర్ ఏర్పాటు చేయడంతో ఈ ఫోన్ అత్యుత్తమ ప్రదర్శనని ఇస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. కార్మిన్ రెడ్, అరోరా బ్లాక్, మొరాకో బ్లూ అనే మూడు రంగులలో లభించే ఈ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. దీని ధర సుమారుగా రూ.31,100గా ఉండనుంది.

ప్రత్యేకతలు:

  • 6.1" క్యూహెచ్డీ ప్ల‌స్ డిస్ప్లే ( 3120 x 1440 పిక్స‌ల్స్)
  • క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 821 ప్రాసెస‌ర్‌
  • 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ (2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌)
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
  • 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ (క్విక్ చార్జ్ 3.0)

  • Loading...

More Telugu News