nithya menon: నిత్యా మీనన్ 'ప్రాణ' విడుదల ఖరారు

  • ఒకే ఒక పాత్రతో రూపొందిన 'ప్రాణ'
  • మలయాళంలో ఈ నెల 18న రిలీజ్
  • మూడు భాషల్లో వచ్చేనెల 8న  
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో నిత్యామీనన్ కి ఎంతో క్రేజ్ వుంది. మొదటి నుంచి కూడా నటనకి అవకాశం కలిగిన విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ రావడమే అందుకు కారణం. అలాంటి నిత్యామీనన్ తాజా చిత్రంగా 'ప్రాణ' నిర్మితమైంది. ఈ సినిమా ఆధ్యంతం ఒక్క నిత్యామీనన్ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఆమె చుట్టూనే కథ తిరుగుతుంది.

ఒక రకంగా ఇదొక అరుదైన .. ప్రయోగాత్మక చిత్రమని చెప్పాలి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. వీకే ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మలయాళంలో ఈ నెల 18వ తేదీన విడుదల చేస్తున్నారు. ఇక తెలుగు .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 7న 'మహానాయకుడు' .. ఫిబ్రవరి 8వ తేదీన 'యాత్ర' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇలాంటి సమయంలో 'ప్రాణ' రంగంలోకి దిగడమంటే సాహసమేనని చెప్పాలి.
nithya menon

More Telugu News