Andhra Pradesh: కాపు జాతికి రిజర్వేషన్లు ఇస్తామన్నారు.. ఇప్పుడు తప్పించుకుంటున్నారు!: చంద్రబాబుపై ముద్రగడ ఆగ్రహం

  • అవకాశమున్నా హామీలు అమలు చేయలేదు
  • కొత్తగా రిజర్వేషన్లు ఏమీ కోరడంలేదు
  • అనంతపురంలో మీడియాతో మాట్లాడిన కాపు నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విరుచుకుపడ్డారు. అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఏపీలోని అనంతపురంలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ముద్రగడ మీడియాతో మాట్లాడారు.

తాము కొత్తగా కాపుల కోసం రిజర్వేషన్ అడగడం లేదని ముద్రగడ స్పష్టం చేశారు. ముందుగా కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసం చంద్రబాబు గతంలో కాపు జాతికి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారనీ, ఇప్పుడు ఆ విషయంలో తప్పించుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Andhra Pradesh
Anantapur District
kapu
reservation
mudragada
Chandrababu
Telugudesam
media

More Telugu News