Hyderabad: హైదరాబాద్ ఖ్యాతి ఇనుమడించేలా కైట్, స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తాం: తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి

  • ఈ నెల 13 నుంచి 15 వరకు ఈ ఫెస్టివల్ నిర్వహిస్తాం
  • కైట్ ఫెస్టివల్ లో 20 దేశాల నిపుణులు పాల్గొంటారు
  • వెయ్యి రకాల స్వీట్స్ ప్రదర్శన 

హైదరాబాద్ ఖ్యాతి ఇనుమడించేలా అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ ని నిర్వహిస్తామని తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. కైట్, స్వీట్ ఫెస్టివల్ నిర్వహణపై సమీక్షించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఈ ఫెస్టివల్ ఈ నెల 13 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్టు చెప్పారు. కైట్ ఫెస్టివల్ కు 20 దేశాల నుంచి నిపుణులు పాల్గొంటారని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే మహిళలు వెయ్యి రకాల స్వీట్స్ ను ప్రదర్శిస్తారని చెప్పారు. ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు ప్రతీకగా నిలిచే మిఠాయిలు ఉంటాయని, ఈ ఫెస్టివల్ నిర్వహించినన్నీ రోజులూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

More Telugu News