EBC: ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్ బిల్లుపై సవరణలు కోరండి: టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ ఆదేశం

  • ఈ బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో సవరణలు కోరాలి
  • వెనుకబడిన ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల ప్రస్తావన
  • ఈ బిల్లులో తెలంగాణలో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చాలి
అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ బిల్లుపై సవరణలు కోరాలని టీఆర్ఎస్ ఎంపీలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలలో వెనుకబడిన వారికి 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ టీ- అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఇప్పటికే ప్రభుత్వం పంపిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాలను కేంద్రం ఆమోదించాల్సి ఉందని, ఇప్పుడు కేంద్రం రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేపట్టినందున, ఈ బిల్లులో తెలంగాణలో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని కూడా చేర్చాలని కోరాలని ఆదేశించారు. బిల్లులో సవరణ తెచ్చి, తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ను నెరవేర్చాలని పట్టుబట్టాలని ఎంపీలను ఆదేశించారు. 
EBC
10 per cent
reservation
TRS
mp`s
kcr

More Telugu News