Andhra Pradesh: ప్రధాని ఇచ్చిన చాలా హామీలు నెరవేరలేదు.. ఏపీకి ఇంకా రూ.85,000 కోట్లు రావాలి!: జేపీ

  • రూ.771 కోట్లకు మాత్రమే యూసీలు ఇవ్వాలి
  • దుగరాజపట్నంకు ప్రత్యామ్నాయం చూపాల్సిందే
  • రాష్ట్రానికి ఇచ్చిన రుణాలను రద్దు చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో ఇచ్చిన హామీల్లో ఇప్పటికీ చాలావరకూ అమలుకాలేదని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలోని కమిటీ తెలిపింది. కేంద్రం నుంచి ఏపీకి ఇంకా రూ.85,000 కోట్లు రావాల్సి ఉందని వ్యాఖ్యానించింది. పోలవరం రెండో దశ పనులకు సంబంధించిన నిధులను కూడా కలిపితే ఈ మొత్తం మరింత పెరుగుతుందని వెల్లడించింది.

కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలు అంటే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రైవేటు వ్యవహారం కాదని జేపీ ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్రం విజయవాడ, గుంటూరుకు ఇచ్చిన రూ.వెయ్యి కోట్ల నిధులకు సంబంధించి రూ.771 కోట్లకు మాత్రమే ఏపీ ప్రభుత్వం యూసీలు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఒకవేళ కేంద్రానికి నిధులు ఇచ్చేందుకు ఇబ్బంది ఉంటే ఇప్పటికే రాష్ట్రానికి ఇచ్చిన రుణాలను రద్దుచేయాలన్నారు. దుగరాజపట్నం నౌకాశ్రయ నిర్మాణం ఆచరణ సాధ్యం కాదనుకున్నప్పుడు కేంద్రమే ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని ఎంపిక చేసి నిర్మించాలన్నారు. జస్టిస్‌ పర్వతరావు, కె.పద్మనాభయ్య, కాకి మాధవరావు, ప్రొ.ఆర్‌.రాధాకృష్ణ, అజేయకల్లం, ప్రొ.ఎస్‌.గలాబ్‌ సహా 15 మంది నిపుణులతో ఏర్పాటైన కమిటీ నివేదికను జేపీ విడుదల చేశారు.

  • Loading...

More Telugu News