Krishna: వైఎస్ జగన్ కు షాకివ్వనున్న కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు.. పార్టీకి రాజీనామా?

  • గుంటూరు ఎంపీ సీటును ఆశించిన ఆదిశేషగిరిరావు
  • విజయవాడ సీటిస్తానని చెప్పిన జగన్!
  • మనస్తాపంతో పార్టీని వీడే ఆలోచనలో ఆదిశేషగిరిరావు
సూపర్‌ స్టార్‌ కృష్ణ సోదరుడు, వైసీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు జగన్ కు షాకివ్వనున్నారా? ఆయన పార్టీని వీడనున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఆదిశేషగిరిరావు సన్నిహిత వర్గాల సమాచారం మేరకు, తదుపరి ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ సీటును ఆదిశేషగిరి రావు ఆశించారు. అయితే, జగన్‌ మాత్రం ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ప్రతిపాదించారట.

 దీంతో మనస్తాపానికి గురైన ఆదిశేషగిరిరావు వైసీపీకి రాజీనామా చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారని, నేడో రేపో ఆయన రాజీనామా చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం గుంటూరుకు ఎంపీగా, కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తన సోదరుడి అల్లుడైన జయదేవ్ 2014లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కోసం ఆదిశేషగిరిరావు కృషి చేశారు.
Krishna
YSRCP
Adiseshagiri Rao

More Telugu News