bjp: మా పార్టీ అభ్యర్థులను ఓడించడానికి ఎన్నో కుట్రలు చేశారు: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

  • దేవుడు, నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించారు.  
  • గోషామహల్ ప్రజలు ఎంతో కష్టపడి నన్ను గెలిపించారు
  • కనుక అసెంబ్లీలో అడుగుపెడతా
‘తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పదవిని ఎంఐఎంకు ఇస్తే కనుక ఆ సభలో మీరు అడుగుపెడతారా?’ అన్న ప్రశ్నకు రాజాసింగ్ స్పందిస్తూ, గోషామహల్ ప్రజలు ఎంతో కష్టపడి తనను గెలిపించారు కనుక అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి  డబ్బులు వెదజల్లారని, ఓట్ల తొలగింపు వంటి చాలా కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, ఆ దేవుడి దయ, తన నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదం వల్ల తాను గెలిచానని సంతోషం వ్యక్తం చేశారు.
bjp
gosamahal
mla raja singh

More Telugu News