Padma: గర్భిణిపై విచక్షణా రహితంగా దాడి.. గర్భస్రావం!

  • గుడ్లు, పాల కోసం వెళ్లిన పద్మ
  • ఆయాతో ఘర్షణ
  • ఆసుపత్రిలో చికిత్స
అంగన్‌వాడీకి గుడ్లు, పాల కోసం వెళ్లిన గర్భిణిపై అక్కడి ఆయా విచక్షణా రహితంగా దాడి చేసింది. దీంతో ఆమెకు గర్భస్రావం అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మద్దిరాల తండాలోని మాళోత్ పద్మ అనే ఆరు నెలల గర్భిణి ప్రభుత్వం అందిస్తున్న గుడ్లు, పాల కోసం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది.

అక్కడ పనిచేస్తున్న ఆయాతో గుడ్ల విషయమై చిన్నపాటి ఘర్షణ జరిగింది. దీంతో గర్భిణి అన్న విచక్షణ కూడా కోల్పోయిన ఆయా.. పద్మపై దాడి చేసింది. దీంతో ఆమెకు గర్భస్రావమైంది. వెంటనే పద్మను చికిత్స నిమిత్తం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు.
Padma
Anganwadi
Eggs
Tekulapally
kothagudem
Abortion

More Telugu News