KA Paul: 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాం.. పార్టీలో పదివేల మందిని చేర్పించిన వారికే టికెట్: కేఏ పాల్

  • ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదు
  • మార్చిలో ఆలోచన చేస్తాం
  • పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో చేస్తాం
రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాల్లో పోటీ చేస్తామని... పదివేల మంది ఓటర్లను పార్టీలో చేర్పించిన వారికే రానున్న ఎన్నికల్లో తమ పార్టీ టికెట్ ఇస్తామని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. నేడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకునే యోచన లేదని.. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే మార్చిలో ఆలోచిస్తామని తెలిపారు. మార్చి నెలాఖరుకల్లా పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతుందన్నారు.
KA Paul
Prajashanthi Party
Rajahmundry
East Godavari District

More Telugu News