Narendra Modi: ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి కేటాయించాలని కోరుతూ ప్రధానికి వినతి

  • ప్రధానిని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు
  • జితేందర్ రెడ్డి నేతృత్వంలో వినతిపత్రం
  • ట్విట్టర్ ద్వారా ఫోటోల షేర్
ప్రధాని నరేంద్ర మోదీని నేడు టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో కలిసి ఓ వినతిపత్రాన్ని సమర్పించారు. ఎంపీ జితేందర్ రెడ్డి నేతృత్వంలో ఎంపీ బూర నర్సయ్య గౌడ్, వినోద్, సంతోష్ కుమార్, ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు. తమ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఢిల్లీలో భూమి కేటాయించాలని కోరుతూ ఈ సందర్భంగా వారు ప్రధానికి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడమే కాకుండా ఎంపీలు ప్రధానిని కలిసిన ఫోటోలను షేర్ చేసింది.
Narendra Modi
Vinod
Jitender Reddy
Santhosh kumar
Venugopala chari
Delhi

More Telugu News