aashritha: వైఎస్ విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి .. ఫస్టులుక్ రిలీజ్

  • రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి 
  • మరికొద్ది సేపట్లో ట్రైలర్ రిలీజ్ 
  • ఫిబ్రవరి 8వ తేదీన సినిమా విడుదల  

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా 'యాత్ర' సినిమా రూపొందింది. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటించారు. రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి లుక్ కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కి .. ట్రైలర్ కి కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ పాత్రలో 'ఆశ్రిత వేముగంటి' నటించింది. ఆమెకి సంబంధించిన ఫస్టులుక్ ను కొంతసేపటి క్రితం విడుదల చేశారు.

ఆశ్రిత వేముగంటి లుక్ వైఎస్ విజయమ్మకు చాలా దగ్గరగా అనిపిస్తోంది. ఈ పాత్ర విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నారనేది ఆమె లుక్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ సినిమా నుంచి మరికొద్ది సేపట్లో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రాజశేఖర్ రెడ్డి అభిమానులంతా ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

  • Loading...

More Telugu News