Andhra Pradesh: బీజేపీకి రాజీనామా చేయనున్న రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే?
- అమిత్ షాను కలవనున్న సత్యనారాయణ
- కేంద్రం వ్యవహారశైలి వల్లే రాజీనామా
- జనసేన పార్టీలో చేరే అవకాశం
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి షాక్ తగలనుంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆకుల సత్యనారాయణ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను త్వరలోనే కలుసుకోనున్న సత్యనారాయణ.. తన రాజీనామా లేఖను ఆయనకు అందించనున్నారు.
కాగా బీజేపీకి సత్యనారాయణ ఎందుకు రాజీనామా చేస్తున్నారన్న విషయంలో స్పష్టత లేనప్పటికీ, ప్రత్యేకహోదా, విభజన హామీల అమలులో కేంద్రం వైఖరి నేపథ్యంలోనే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాగా, బీజేపీ నుంచి బయటకు వచ్చాక ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరే అవకాశముందని భావిస్తున్నారు.